రాజకీయ ఖాయిలా
తుపాను ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులూ పర్యటించారు గాని పరిస్థితి తీవ్రతకు సరిపడిన చర్యలేవీ ప్రకటించిన దాఖలాలు లేవు.గత వరదలు, తుపానుల సహాయమే ఇంకా అందవలసి వుండగా తాజా నష్టం నుంచి పరిహారం లభిస్తుందన్న భరోసా ఎక్కడా కనిపించడం లేదు. ఇదే గాక కాంట్రాక్టు లెక్చరర్లు, 104 వుద్యోగులు, బీడీ కార్మికులు, ఉపాధ్యాయ వుద్యోగ వర్గాలు, నియామకాలు కోరుతున్న నిరుద్యోగులు ఇలా అన్ని తరగతుల ప్రజల సమర ఘోషతో ధర్నా చౌక్ దద్దరిల్లుతున్నది గాని పాలకుల నుంచి పరిష్కార సూచనలే రావడం లేదు.
No comments:
Post a Comment